
1 ఓ సద్భక్తులారా!
లోకరక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించేన్
రాజాధిరాజు
ప్రభువైన యేసు
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింపరండి యుత్సాహముతో
2 సర్వేశ్వరుండు
నరరూప మెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసేన్
మానవజన్మ
మెత్తిన శ్రీ యెసూ
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
3 ఓ దూతలారా!
ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుడి
పరాత్పరుండా
నీకు స్తోత్ర మంచు
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో
4 యేసూ! ధ్యానించి
నీ పవిత్రజన్మ
మీవేళ స్తోత్రము నర్పింతుము
ఆనాదివాక్య
మాయె నరరూపు
నమస్కరింప రండి
నమస్కరింప రండి
నమస్కరింపరండి యుత్సాహముతో
thank you so much
ردحذفYou are Welcome..
حذفThank you so much
ردحذفWelcome
حذف2024 here
ردحذفإرسال تعليق